Top
Telugu Gateway

రష్యా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది

రష్యా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది
X

దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ లకు తోడు మరో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అదే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్. భారత్ లో ఈ వ్యాక్సిన్ పంపిణీ వ్యవహారాన్ని దేశంలోని ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ ల సరఫరా ఒకింత మెరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి దశలో హైదరాబాద్ కు లక్షన్నర డోసులు వచ్చాయి. ఈ వ్యాక్సిన్లతో కూడిన విమానం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం జీహెచ్‌ఏసీ- డాక్టర్ రెడ్డీస్ సప్లయ్ చైన్ బృందం, కస్టమ్స్ విభాగం, ఎయిర్ కార్గోకు చెందిన నిపుణులతో కలిసి పని చేస్తోంది. స్పుత్నిక్ వి కన్‌సైన్మెంట్‌ను సజావుగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

Next Story
Share it