Telugu Gateway
Telangana

అత్యవసర మందులు అన్నా ఆపారు

అత్యవసర మందులు అన్నా ఆపారు
X

లాక్ డౌన్ లో చాలా మంది ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వారిని పోలీసులు బాగా కట్టడి చేసే పనిలో ఉన్నారు. అయితే అత్యవసర పనుల నిమిత్తం..అది కూడా మెడికల్ ఎమర్జన్సీ పనుల మీద వెళ్లే వారిని కూడా అడ్డుకోవటం విమర్శలకు గురిచేస్తోంది. ఆదివారం నాడు హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. టాలీవుడ్ హీరో నిఖిలే ఈ బాధితుడుగా నిలిచాడు. 'కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు.

ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాస్‌ ఉండాల్సిందేనని చెప్పారు. తొమ్మిది సార్లు పాస్ కోసం ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని భావించి నేను వచ్చాను'అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. నిఖిల్‌ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. 'డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం'అని రిప్లై ఇచ్చింది.

Next Story
Share it