రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర హైవేపైకి నీళ్లు..ట్రాఫిక్ జామ్
BY Admin5 Sept 2021 10:52 AM IST
X
Admin5 Sept 2021 10:52 AM IST
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జాతీయ రహదారులపై కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రామోజీఫిల్మ్ సిటీ సమీపంలో పెద్ద ఎత్తున నీరు రహదారిపైకి వచ్చి చేరటంతో వాహనాలు చాలా మెల్లగా ముందుకు సాగుతున్నాయి. తొలుత పూర్తిగా ఆగిపోయినా స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.
దీంతో వాహనాలు చాలా మెల్లగా ముందుకు సాగుతున్నాయి. ఇదే రహదారిలోని బాటసింగారం-మాజిద్ పూర్ వెళ్ళే దారిలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నారు.
Next Story