Telugu Gateway
Telangana

గోవాలో ప‌ట్టుబ‌డిన హైద‌రాబాద్ టీవీ న‌టి

గోవాలో  ప‌ట్టుబ‌డిన హైద‌రాబాద్ టీవీ న‌టి
X

హైద‌రాబాద్ కు చెందిన టీవీ న‌టి ఒక‌రు గోవాలో ప‌ట్టుబ‌డ్డారు. ముంద‌స్తు స‌మాచారం మేర‌కు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వ్య‌భిచార ముఠా ఉన్న ప్రాంతంలో దాడులు నిర్వ‌హించారు. ఇందులో ముగ్గురు మ‌హిళ‌లు ఉండ‌గా..అందులో ఒక‌రు హైద‌రాబాద్ కు చెందిన టీవీ న‌టిగా గుర్తించారు. దీంతోపాటు హైద‌రాబాద్ కు చెందిన హ‌ఫీజ్ స‌య్య‌ద్ బిలాల్ ను అరెస్ట్ చేసిన‌ట్లు గోవా పోలీసులు వెల్ల‌డించారు. మిగిలిన ఇద్ద‌రు ముంబ‌య్ కు చెందిన వారు అని తెలిపారు. ప‌నాజీ స‌మీపంలోని స‌న్ గోల్డా ప్రాంతంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌మ‌కు వ‌చ్చిన స‌మాచారాన్ని నిర్దారించుకున్న త‌ర్వాత తాము ఈ దాడులు చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అరెస్ట్ చేసిన వ్య‌క్తి హోట‌ల్ వ‌ద్ద 50 వేల రూపాయ‌ల‌కు డీల్ కుదుర్చుకున్నాడ‌ని తెలిపారు..

Next Story
Share it