అయోధ్యకు స్పైస్ జెట్ ఫ్లైట్ టేకాఫ్
BY Admin2 April 2024 1:18 PM GMT
X
Admin2 April 2024 1:18 PM GMT
హైదరాబాద్ నుంచి అయోధ్య కు విమాన సర్వీస్ లు మంగళవారం నాడు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీస్ లు వారంలో మూడు రోజులు ఉంటాయి. అయోధ్యకు స్పైస్ జెట్ తొలి విమానం జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 2 ఉదయం 10 .45 గంటలకు బయలు దేరి వెళ్ళింది. ఈ విమానం అయోధ్యకు 12 .45 నిమిషాలకు చేరుతుంది.
అయోధ్య లో తిరిగి 13 .25 నిమిషాలకు బయలు దేరి హైదరాబాద్ కు 15 .25 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ నాన్ - స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది జనవరి 24 న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరగటంతో భక్తులు ఇప్పుడు పెద్ద ఎత్తున అయోధ్యకు వెళుతున్న విషయం తెలిసిందే.
Next Story