అధికారికంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఫలితాల వెల్లడి
పలు వివాదాలు..ఎన్నో మలుపుల మధ్య హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వివరాలను క్లబ్ నోటీసు బోర్డులో పెట్టారు. ప్రధానంగా ప్రెసిడెంట్ ఎన్నిక ఫలితం విషయంలో తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. పలుమార్లు రీ కౌంటింగ్ తర్వాత కూడా ప్రెసిడెంట్ అభ్యర్ధి సూరజ్ భరద్వాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఫలితాల ప్రకటన తాత్కాలికంగా నిలిపివేశారు. 13 అర్ధరాత్రి జరిగిన గలాటాలో కొంత మంది వ్యక్తుల బ్యాలెట్ బాక్సుల్లో నీళ్ళు కూడా పోశారు. వ్యవహారం ప్రెసిడెంట్ అభ్యర్ధి సూరజ్ పై ఫిర్యాదు, ఎప్ ఐఆర్ నమోదు వరకూ వెళ్ళిన విషయం తెలిసిందే. నోటీసు బోర్డులో పెట్టిన పలితాల ప్రకారం ఎల్. వేణుగోపాల్ నాయుడికి 489 ఓట్లు వచ్చాయి.
సూజర్ వి భరద్వాజ్ కు 409 ఓట్లు, సతీష్ కమాల్ కు 204 ఓట్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు 1102 అయితే..అందులో 11 ఓట్లను తిరస్కరించినట్లు నోటీసులో పెట్టిన వివరాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే వ్యవహారం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా వేణుగోపాల్ నాయుడు, వైఎస్ ప్రెసిడెంట్ మహిళా విభాగంలో సి. వనజ, మరో వైఎస్ ప్రెసిడెంట్ గా కె. శ్రీకాంత్ రావు, జనరల్ సెక్రటరీగా రవికాంత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, ట్రెజరర్ గా ఏ. రాజేష్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ పలితాలను మార్చి 14న ప్రకటించినట్లు ఈ నోటీసులో ఉంది.