కనీస ధర రూ 12 ...గరిష్ట ధర 75
BY Vasi Reddy15 May 2025 6:09 PM IST

X
Vasi Reddy15 May 2025 6:09 PM IST
హైదరాబాద్ మెట్రో సూపర్ సక్సెస్. ఎప్పుడు చూసినా ఖాళీ ఉండదు. అయినా సరే ఈ ప్రాజెక్ట్ భారీ ఎత్తున నష్టాల్లో ఉంది అని ఎల్ అండ్ టి చెపుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నాడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం హైదరాబాద్ మెట్రో లో కనీస చార్జీ పన్నెండు రూపాయలు...గరిష్ట చార్జీ డెబ్బయి ఐదు రూపాయలకు చేరాయి. హై కోర్ట్ మాజీ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు అయిన చార్జీల ను నిర్ణయించే కమిటీ (ఎఫ్ఎఫ్ సి ) సిఫారసులకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. పెరిగిన చార్జీలు కూడా వెంటనే అంటే మే 17 నుంచి అమల్లోకి రానున్నాయి.
Next Story



