Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ కు ఎందుకీ పరిస్థితి!

బిఆర్ఎస్ కు ఎందుకీ పరిస్థితి!
X

తెలంగాణాలోని అధికార బిఆర్ఎస్ నేతలు ఒక వైపు ఫేక్ ప్రచారాలు చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇప్పుడు విస్తృతంగా ఇస్తున్న డిజిటల్ యాడ్స్ లో కూడా అబద్దాలు ప్రచారం చేయటం చర్చనీయాంశగా మారింది. అది కూడా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఫొటోలతో ఈ ప్రచారం చేయటం విశేషం. ఇప్పటి వరకు నమోదు అయిన అత్యధిక ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షల పది వేలు. ఇది 2023 జులై మూడున నమోదు అయింది. కానీ బిఆర్ఎస్ పేరుతో కెసిఆర్ ఫోటోతో ఇస్తున్న యాడ్స్ లో మాత్రం హైదరాబాద్ మెట్రోలో రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు నమోదు అయిన ఒక రోజు ప్రయాణికుల సంఖ్య 5 .10 లక్షలు అయితే...బిఆర్ఎస్ మాత్రం రోజు ఆరు లక్షల మంది మెట్రో లో ప్రయాణిస్తున్నట్లు చెప్పటంపై అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందరం కలిసి 70 కిలోమీటర్ల మెట్రో ను నిర్మించుకున్నాం అని..దీన్ని ఇప్పుడు 415 కిలోమీటర్ల కు తీసుకువెళదాం అంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి హైదరాబాద్ మెట్రో పరుగులు తీయటంలో జాప్యానికి కెసిఆర్ కారణం అనే విమర్శలు ఉన్నాయి.

ప్రతిపక్షంలో ఉండగా మెట్రో అలైన్ మెంట్ మార్చాల్సిందే అని కెసిఆర్ గట్టిగా వాదించారు. చారిత్రిక భవనం అయిన అసెంబ్లీ ముందు నుంచి మెట్రో వెళ్ళటానికి వీలు లేదని...పైగా ఇది తెలంగాణ అమరవీరుల స్థూపం మీదుగా పెట్టారు అని..ఇది సెంటిమెంట్ తో కూడుకున్న అంశం...సుల్తాన్ బజార్ ఒక చారిత్రకమైన వ్యవస్థ అది...దాన్ని ధ్వంసం చేయకుండా చూడాలన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ తాను చెప్పిన మాటలను పూర్తిగా విస్మరించి ముందు ఖరారు అయిన రూట్ లోనే మెట్రో కు ఓకే చేశారు. ఇప్పుడు బిఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ మెట్రో క్రెడిట్ అంతా తమదే అన్నట్లు కలరింగ్ ఇస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. పరిశ్రమలు..ఉద్యోగాలు అన్ని ఎక్కువ చేసి చూపించినట్లు ఇప్పుడు ఎన్నికల యాడ్స్ లో చివరకు మెట్రో ప్రయాణికుల సంఖ్యను కూడా ఎక్కువ చేసి చూపిస్తున్నారు.

Next Story
Share it