Telugu Gateway
Telangana

హైద‌రాబాద్ మెట్రో..హాలిడే ఆఫ‌ర్

హైద‌రాబాద్ మెట్రో..హాలిడే  ఆఫ‌ర్
X

సెల‌వుల్లో అతి త‌క్కువ ఛార్జీతో రోజంతా ప్ర‌యాణించేందుకు వీలుగా హైద‌రాబాద్ మెట్రో ప్ర‌త్యేక ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. దీని కోసం మెట్రో సూపర్ సేవర్ కార్డును విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం హాలిడేస్‌లో రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చని ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. గురువారం నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైందన్నారు. సూపర్ సేవర్‌ కార్డు ఆఫర్ 100 హాలిడేస్‌కి వర్తింప చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో ప్ర‌ధానంగా ప్రతి ఆదివారంతోపాటు రెండ‌వ‌, నాల్గ‌వ శ‌నివారం, ఉగాది, రంజాన్, మెహ‌ర్రం, బోనాలు, స్వాతంత్ర దినోత్స‌వం, వినాయ‌క‌చ‌వితి, క్రిష్ణాష్ణ‌మి, ద‌స‌రా, దీపావ‌ళి, బాక్సింగ్ డే, భోగీ, సంక్రాంతి, శివ‌రాత్రి వంటి కీల‌క పండ‌గ‌లు ఉంటాయి.

ఇదిలా ఉంటే కరోనా తర్వాత మళ్లీ మెట్రో పుంజుకుంటోందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్ల‌డించారు. కరోనా సమయంలో ఎక్కువ రోజులు రైళ్లను బంద్ చేయడంతో పాటు, నడిచిన సమయంలోనూ చాలా రోజుల వరకూ ప్రయాణీకులు మెట్రో పై ఆసక్తి చూపించక పోవడం వల్ల హెచ్ ఎం ఆర్ సంస్ధ నష్టాల్లో కూరుకు పోయింది. కానీ గత కొంతకాలంగా మళ్లీ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం మళ్లీ మెట్రోలో 60 శాతం రద్దీ పెరిగిందని ఆయన తెలిపారు.

Next Story
Share it