Telugu Gateway
Telangana

బెంగుళూరు కంటే హైద‌రాబాద్ లో మెరుగైన వ‌స‌తులు

బెంగుళూరు కంటే హైద‌రాబాద్ లో మెరుగైన వ‌స‌తులు
X

తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖల‌ మంత్రి కెటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఏరోస్పేస్, ర‌క్షణ రంగాల‌కు ఎన్నో మెరుగైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు. కెటీఆర్ శుక్ర‌వారం నాడు టాటా బోయింగ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ విజ‌యోత్స‌వ స‌మావేశంలో పాల్గొని మాట్లాడారు. బెంగుళూరు క‌న్నా హైద‌రాబాద్ లో మెరుగైన వ‌స‌తులు ఉన్నాయ‌ని తెలిపారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లోని ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు హైద‌రాబాద్ లో ఉన్నాయ‌ని తెలిపారు.

ఈ రంగంలోని స్టార్ట‌ప్ లకు కూడా హైద‌రాబాద్ కేంద్రంగా ఉంద‌న్నారు. ఈ రంగాల‌కు సంబంధించి తెలంగాణ స‌ర్కారు ఏడు ప్ర‌త్యేక పారిశ్రామిక పార్కులు ఉన్నాయ‌ని తెలిపారు. తెలంగాణ‌లో మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టేందుకు టాయి బోయింగ్ లు ముందుకు రావాల‌న్నారు. టాటా బోయింగ్ హైద‌రాబాద్ యూనిట్ లో త‌యారు అయిన విమానం ప్ర‌ధాన బాడీ విభాగం (Fuselage) డెలివ‌రి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే కంపెనీ ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌టం సంతోషంగా ఉంద‌న్నారు.

Next Story
Share it