Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో మిలియనీర్ల హై జంప్!

హైదరాబాద్ లో మిలియనీర్ల హై జంప్!
X

హైదరాబాద్ లో కళ్ళు చెదిరే భవనాలే కాదు...సంపన్నులు కూడా అలాగే పెరిగిపోతున్నారు. . ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ప్రస్తుత విదేశీ మారక విలువ ప్రకారం ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. అలాంటిది ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఏకంగా పదకొండు వేల మంది మిలియనీర్లు ఉన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై లో మిలియనీర్ల సంఖ్య 59400 గా ఉంటే... దేశ రాజధాని ఢిల్లీ లో మాత్రం 30200 మంది మిలియనీర్లు ఉన్నారు. దేశ ఐటి రాజధాని బెంగళూర్ లో హైదరాబాద్ కంటే కొంత ఎక్కువగా 12100 మంది మిలియనీర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 65 స్థానంలో ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో నగరంలో సంపన్నులు సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రపంచంలోనే అత్యధిక మంది మిలియనీర్లు ఉన్న నగరంగా అమెరికా కు చెందిన న్యూ యార్క్ మొదటి స్థానంలో ఉంది. డిసెంబర్ 2022 నాటికీ ఈ నగరంలో ఏకంగా 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. న్యూ యార్క్ తర్వాత జపాన్ రాజధాని టోక్యో నగరం 290300 మంది మిలియనీర్ల తో రెండవ స్థానంలో నిలిచింది. టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న నగరాల్లో న్యూ యార్క్, టోక్యో తో పాటు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, లండన్ , సింగపూర్, లాస్ ఏంజెల్స్, హాంగ్ కాంగ్, బీజింగ్, షాంగై, సిడ్నీ వంటి నగరాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 97 పట్టణాలు హెన్లీ అండ్ పార్టనర్స్ సిద్ధం చేసిన సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Next Story
Share it