Telugu Gateway
Telangana

హుజూరాబాద్ ప్ర‌త్యేకం..ద‌ళిత బంధుకు 2000 కోట్లు విడుద‌ల పూర్తి

హుజూరాబాద్ ప్ర‌త్యేకం..ద‌ళిత బంధుకు 2000 కోట్లు విడుద‌ల పూర్తి
X

తెలంగాణ స‌ర్కారు కొత్త‌గా ద‌ళిత బంధు కోసం మ‌రో 500 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసింది. దీంతో ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్ర‌క‌టించిన రెండు వేల కోట్ల రూపాయ‌లు నిధులు మంజూరు పూర్త‌యింది. ఇది అంతా ఒక్క హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే. సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం నాడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన 2000 కోట్ల రూపాయ‌ల నిధుల లక్ష్యం , నేడు విడుదల చేసిన ఈ 500 కోట్లతో సంపూర్ణమైంది.

పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు అమలు చేయడమే మిగిలింది.శుక్ర‌వారం నాడు సీఎం కెసీఆర్ రేపు కరీంనగర్ కలెక్టరేట్లో తెలంగాణా దళితబంధు పథకంపై సమీక్ష నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. తెలంగాణ స‌ర్కారు ఈ ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ద‌ళిత బంధుతోపాటు ప‌లు ప‌థ‌కాలు అన్నీ హుజూరాబాద్ లోనే అమ‌లు చేస్తోంది. రాష్ట్ర‌మంత‌టా ఆగిపోయిన‌వి కూడా అక్క‌డ మాత్రం య‌మా స్పీడ్ సాగిపోతున్నాయి.

Next Story
Share it