Telugu Gateway
Telangana

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌..లీడ్ లో ఈటెల‌

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌..లీడ్ లో ఈటెల‌
X

అత్యంత ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి..ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరి స‌వాల్ విసిరిన ఈటెల రాజేంద‌ర్ ట‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. అయితే తొలి రౌండ్ నుంచి బిజెపి అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ ఆధిక్య‌త క‌న‌ప‌రుస్తున్నారు. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 4444 ఓట్లు రాగా, బిజెపికి 4610 ఓట్లు వ‌చ్చాయి. ఈ లెక్క‌న తొలి రౌండ్ లో బిజెపి అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ 166 ఓట్ల ఆధిక్యం ల‌భించింది. రెండ‌వ రౌండ్ లోనూ బిజెపి అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ ఆధిక్య‌త క‌న‌ప‌ర్చారు. మూడు రౌండ్లు పూర్త‌య్య నాటికి ఈటెల రాజేంద‌ర్ 1269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడవ రౌండ్ లో ఈటెల‌కు అత్య‌ధికంగా 911 లీడ్ ద‌క్కింది. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన లీడ్ లో ఇదే అత్య‌ధికం కావ‌టం విశేషం.

Next Story
Share it