మరి ఓఆర్ఆర్..తెలంగాణ భూముల విషయం!
అన్నిటికి కంటే కీలక విషయం ఏమిటి దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ లకు అసలు పాలన చేతకాదు అని , తమకు ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తాం..అమెరికా, చైనాలను దాటిస్తాం అని చెప్పే కెసిఆర్, కేటీఆర్ లు ఇక్కడ పాలన సాగించటానికి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండాల్సిన భూములను ఎడాపెడా అమ్మేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవటం లేదా. దేశాన్నిఅంత అద్భుతంగా పాలించే ప్లానింగ్ ఉన్నప్పుడు ఇక్కడ భూములు అమ్మి, అప్పులు చేసి పాలన సాగించాల్సిన అవసరం ఏమి ఉంది. నిజంగానే కెసిఆర్, కెటిఆర్ లు చెప్పినట్లు అంత అద్భుత పాలన అందిస్తే అడగకుండానే వాళ్లకు ప్రజలు అవకాశం కలిపిస్తారు కదా. కానీ గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని రీతిలో అప్పులు చేస్తూ..భూములు అమ్ముతూ మాటలు చెపితే ఎవరైనా నమ్ముతారా. ఇక కెసిఆర్ గత పదేళ్లలో ఇచ్చిన హామీలు..విస్మరించిన వాటి జాబితా రాయాలంటే అది ఒక పెద్ద చాంతాడు అంత అవుతుంది. అయినా సరే మంత్రి కేటీఆర్ మాత్రం కెసిఆర్ అంటే నమ్మకం అని ప్రజలకు చెపుతున్నారు. ఈ మాటలు నమ్ముతారా లేదా అన్నది డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో కానీ తేలదు.