Telugu Gateway
Telangana

కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కోసం 58 కోట్లు కేటాయింపా?

కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కోసం 58 కోట్లు కేటాయింపా?
X

సీఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టు నోటీసు

తెలంగాణ స‌ర్కారు తీరుపై హైకోర్టు విస్మ‌యం వ్య‌క్తం చేసింది. కోర్టు ధిక్క‌రణ కేసుల ఖ‌ర్చుల కోసం అంటూ ప్ర‌భుత్వం 58 కోట్ల రూపాయ‌లు మంజూరు చేయ‌టంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అస‌లు ఇలా ఎలా నిధులు మంజూరు చేస్తారు..దీనికి ట్రెజ‌రీ నిబంధ‌న‌లు అనుమ‌తిస్తాయా అంటూ ప్ర‌శ్నించింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. సీఎస్ సోమేష్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసులిచ్చింది.

తదుపరి విచారణ అక్టోబర్ 27కు వాయిదా హైకోర్టు వేసింది. అప్పటివరకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జూన్ 10న సీఎస్ సోమేష్ కుమార్ స్వ‌యంగా జీవో జారీ చేశారు. అందులో ముఖ్యంగా సీసీఎల్ ఏగా సోమేష్ కుమార్ ఉన్న స‌మ‌యంలోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అయ్యాయి. అంతే కాదు ఆ ప‌ద‌విలో ఆయ‌న చాలా కాలం కొన‌సాగారు కూడా. ట్రెజ‌రీ నిబంధ‌న‌లు స‌డ‌లించి, త్రైమాసిక నియంత్ర‌ణ ఆదేశాల‌కు మిన‌హాయించి మ‌రీ ఈ నిధుల కేటాయింపు చేశారు.

Next Story
Share it