Telugu Gateway
Telangana

ఎస్ఈసీ అర్దరాత్రి నిర్ణయానికి బ్రేక్

ఎస్ఈసీ అర్దరాత్రి నిర్ణయానికి బ్రేక్
X

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అర్ధరాత్రి నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. స్వస్తిక్ ముద్రే కాకుండా.. మార్కర్ పెన్నుతో టిక్ పెట్టినా ఓటును పరిగణించాలంటూ ఎస్ఈసీ గురువారం రాత్రి సర్కులర్ జారీ చేసింది. దీనిపై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాకుండా శుక్రవారం ఉదయమే హౌస్ మోషన్ మూవ్ చేసింది. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఎస్ఈసీ సర్కులర్ కొట్టివేసింది.

కేవలం స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి పోలింగ్ బూత్ లోనూ స్విస్తిక్ ముద్రలనే పెట్టారు. కానీ ఎస్ఈసీ అకస్మికంగా పెన్నుతో, మార్కర్ తో టిక్కు పెట్టినా ఓకే అంటూ సర్కులర్ జారీ చేయటం తీవ్ర విమర్శల పాలైంది. పోలింగ్ శాతం వెల్లడి దగ్గర నుంచి పలు అంశాల్లో ఎస్ఈసీ తీరు విమర్శల పాలు అయింది.

Next Story
Share it