హెటిరో డ్రగ్స్..మొత్తం 700 కోట్ల గోల్ మాల్
142 కోట్ల రూపాయలు సీజ్
లెక్కల్లో చూపని మరో550 కోట్ల రూపాయలు
లెక్క చెప్పని నగదు 142.78 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇప్పటివరకూ లెక్కల్లో చూపని మరో 550 కోట్ల రూపాయలను గుర్తించారు. ఈ లెక్కన లెక్కచెప్పని 142 కోట్ల రూపాయలు..లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయలతో కలిపితే మొత్తం 700 కోట్ల రూపాయల గోల్ మాల్ వ్యవహారాలు బయటపడ్డాయి. హెటిరో పేరు పెట్టకుండానే సీబీడీటీ శనివారం నాడు ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థపై దాడి చేసిన సమయంలో ఈ విషయాలు కనుగొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. హెటిరో కార్యాలంయలో నగదుతోపాటు రెండవ సెట్ బుక్స్ ను కూడా గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్నారు.
నేరారోపణ చేసేందుకు అవసరమైన సమాచారాన్ని శాప్, ఈఆర్ పీ సాఫ్ట్ వేర్ ల ద్వారా సేకరించినట్లు వెల్లడించారు. అసలు ఉనికే లేని బోగస్ కంపెనీల ద్వారా కొనుగోళ్లు చేసినట్లు చూపించటం, అదే సమయంలో ఖర్చు ఎక్కువ చేసినట్లు కృత్రిమ లెక్కలు చూపించారని గుర్తించారు.డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేశారు. వ్యక్తిగత ఖర్చులను కూడా కంపెనీ ఖాతాల్లో చూపించారని ఐటి శాఖ తన నివేదికలో పేర్కొంది. తనిఖీల సమయంలో పలు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేలింది. ఈ దాడులకు సంబంధించి లెక్కల్లో వెల్లడించని ఆదాయం మొత్తం ఎంత అనే వివరాలు తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.