హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన
BY Admin22 July 2022 9:10 AM IST

X
Admin22 July 2022 9:10 AM IST
నగరంలో శుక్రవారం ఉదయం నుంచే వర్షం దంచికొడుతోంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం ఓ వారం రోజుల పాటు ముసురుపట్టి వీడకుండా వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ వర్షం దంచికొట్టడం ప్రారంభించటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో మరో రెండురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story



