Telugu Gateway
Telangana

హైద‌రాబాద్ ను వ‌ణికిస్తున్న వ‌ర్షం

హైద‌రాబాద్ ను వ‌ణికిస్తున్న వ‌ర్షం
X

గులాబ్ ప్ర‌భావంతో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అవుతోంది. సోమ‌వారం ఉద‌యం నుంచి ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లోని కాల‌నీల్లోకి నీరు చేరింది. ప్ర‌ధాన ర‌హ‌దారులు మొద‌లుకుని ప‌లు అన్ని చోట్లా వాహ‌న‌దారులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. సోమ‌వారం ఉద‌యం నుంచే వ‌ర్షం ప్రారంభం అయినా మ‌ధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు రాత్రి కూడా భారీ వ‌ర్ష సూచ‌న రావటంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అత్య‌వ‌స‌రం అయితే ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ హెచ్చ‌రించింది.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. మ‌ణికొండ‌లో గ‌ల్లంతు అయిన ఇంజ‌నీరింగ్ మ‌ర‌ణించిన‌ట్లు నిర్ధారించారు. ఆయ‌న బాడీని సిబ్బంది వెలికితీశారు. ఇదిలా ఉంటే భారీ వ‌ర్షాల కార‌ణాలు ఇంజ‌నీరింగ్, డిగ్రీ ప‌రీక్షల‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే స‌మయంలో మంగ‌ళ‌వారం నాడు స్కూళ్ళ‌కు కూడా సెల‌వు ప్ర‌క‌టించారు.

Next Story
Share it