Telugu Gateway
Telangana

విద్వేష ప్ర‌సంగాల కేసు..అక్భ‌రుద్ధీన్ కు కోర్టులో ఊర‌ట‌

విద్వేష ప్ర‌సంగాల కేసు..అక్భ‌రుద్ధీన్ కు కోర్టులో ఊర‌ట‌
X

ఎంఐఎం శాస‌న‌స‌భాప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీకి పెద్ద రిలీఫ్‌. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు బుధ‌వారం నాడు తీర్పు వెలువ‌రించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.. కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబరాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

క్ష

Next Story
Share it