Telugu Gateway
Telangana

పీసి ఘోష్ కమిషన్ పై హై కోర్ట్ తీర్పు

పీసి ఘోష్ కమిషన్ పై హై కోర్ట్ తీర్పు
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు వేసిందే అరకొర కమిషన్. ఇప్పుడు అది కూడా అట కెక్కినట్లు అయింది. దీంతో తెలంగాణాలో కాంగ్రెస్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది అని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న మొత్తం అవినీతిని నిగ్గుతేల్చకుండా కేవలం ఈ ప్రాజెక్ట్ బ్యారేజీల్లో చోటు చేసుకున్న అవకతవకలు...డిజైన్ల లోపాలు...ఇతరత్రా అంశాలపై విచారణకు జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ ను తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే అయినా ఇది ఎలాంటి నిబంధనలు పాటించలేదు అని తెలంగాణ హై కోర్ట్ అభిప్రాయపడింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించింది. వీళ్ళతో పాటు బిఆర్ఎస్ హయాంలో సాగునీటి శాఖ బాధ్యతలు చూసిన ఐఏఎస్ అధికారులు ఎస్ కె జోషి తో పాటు స్మిత సబర్వాల్ లు కూడా ఈ కమిషన్ నివేదికను కొట్టి వేయాలంటూ కోర్ట్ ను ఆశ్రయించారు.

అన్ని పిటిషన్ లపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్ట్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హై కోర్ట్ తీర్పుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుంది అన్నది కీలకంగా మారబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు కావస్తోంది. కానీ ఈ విషయంలో ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేకపోయింది. తెలంగాణా హై కోర్ట్ ఏకంగా జస్టిస్ పీ సి ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు అని కామెంట్స్ చేసింది అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో తేడా ఉన్నట్లు కనిపిస్తోంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారుకు బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ప్రాజెక్ట్ స్కాం విషయంలో చిత్తశుద్ధి ఏ మాత్రం లేదు అనే అనుమానాలు మొదటి నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంతో పీ సి ఘోష్ కమిషన్ కు ఇచ్చిన టర్మ్స్ అఫ్ రెఫరెన్సు లే అని చెప్పొచ్చు.

Next Story
Share it