Telugu Gateway
Telangana

గ్రేటర్ ఎన్నికల వరాలు

గ్రేటర్ ఎన్నికల వరాలు
X

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు తెలంగాణ సర్కారు పలు వరాలు ప్రకటించింది. ఈ వరాలు అన్నీ చూస్తుంటే ఎన్నికలే లక్ష్యంగానే ఇవి ప్రకటించినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికల వరాల వివరాలను తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీలతో కలసి సచివాలయంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2020-21 ప్రాపర్టీ ట్యాక్స్‌ లో కొంత ఊరట ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. జీహెచ్‌ఎంసీలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో జీహెచ్‌ఎంసీలో 13.72 లక్షలు.. మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షలు.. తెలంగాణ వ్యాప్తంగా 31.40 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఆస్తి పన్ను కట్టిన వారికి వచ్చే ఏడాది రాయితీ ఇస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం అంశంపైనా ఆయన స్పందించారు. ఇప్పటికే 4,75,871 కుటుంబాలకు వరద సాయం రూ.10 వేల చొప్పున అందించామన్నారు. వరద సాయం అందని వారికి మరో అవకాశం ఇస్తామని తెలిపారు. బాధితులుగా ఉండి సాయం అందని వారు ఎవరైనా ఉంటే మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ వర్కర్ల జీతాన్ని రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నాం. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తలకిందులు అయ్యింది. ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశామన్నారు.

Next Story
Share it