Telugu Gateway
Telangana

ప్రభుత్వం అంటే కెసిఆర్ ఒక్కరేనా?!

ప్రభుత్వం అంటే కెసిఆర్ ఒక్కరేనా?!
X

రాష్ట్ర మంత్రులు కేవలం పేరుకేనా. సారీ సారీ పేరు పెట్టడానికి కూడా పనికి రారా?. ఇది ఇప్పుడు తెలంగాణ అధికార వర్గాల్లో సాగుతున్న చర్చ . ఇది కెసిఆర్ సీఎం అయినప్పుడు నుంచి ఉన్నా ఈ మధ్య కాలంలో మరిన్ని విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం చూస్తుంటే తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ ఏంటి జగన్ ను ఫాలో కావటం ఏంటి అంటారా. అదే ప్రభుత్వ ప్రకటనల విషయంలో. తెలంగాణ లో ఇటీవల వరకు ఏదైనా శాఖకు సంబదించిన యాడ్ ఇస్తే అందులో ముఖ్యమంత్రి తో పాటు ఆయా శాఖల మంత్రుల ఫోటోలు పెట్టే వారు. కానీ ఏపీలో సీఎం జగన్ ట్రెండ్ మార్చారు. శాఖ ఏదైనా ఓన్లీ సీఎం ఫోటో..మంత్రి పేరు మాత్రం పెడుతూ వస్తున్నారు. అది జాకెట్ యాడ్ ఆయినా..ఫుల్ పేజీ యాడ్ లో కూడా అదే మోడల్ ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోను ఇదే ట్రెండ్ ప్రారంభం అయింది. మంగళవారం నాడు తెలంగాణ లో అన్ని పృముఖ పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. విషయం ఏమిటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతుల ప్రారంభం.

చాలా మంచి కార్యక్రమం. దీంట్లో తప్పు ఏమిలేదు. కానీ ఈ యాడ్ లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫోటో కానీ..కనీసం మంత్రి పేరు కూడా లేక పోవటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కూడా చూస్తున్న విషయం తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం ఇటీవల హైదరాబాద్ నగరానికి ఒక అవార్డు వస్తే అదే పేరుతో కూడా ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అందులోనూ మంత్రి కెటిఆర్ ఫోటో కూడా పెట్టలేదు. ఒక్క సీఎం కెసిఆర్ ఫోటో మాత్రమే పెట్టారు. అకస్మాత్తుగా తెలంగాణ లో కూడా ఈ ఆంధ్ర ప్రదేశ్ ట్రెండ్ ఎందుకు మొదలు పెట్టారో అర్ధం కావటం లేదు అని అధికారులు వ్యాఖ్యనిస్తున్నారు. ఏ శాఖ కార్యక్రమం అయిన కేవలం సీఎం ఫోటో ఒక్కటే వేసే కాడికి ఇక మంత్రులు ఎందుకు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అనధికారింగా అన్ని శాఖల్లోనూ సీఎంకెసిఆర్ , మంత్రి కెటిఆర్ కి తెలియకుండా ఏమి జరగవు అనే ప్రచారం కూడా అధికార వర్గాల్లో ఉంది.

Next Story
Share it