Telugu Gateway
Telangana

తెలంగాణ స‌ర్కారే అతి పెద్ద డిఫాల్ట‌ర్

తెలంగాణ స‌ర్కారే అతి పెద్ద డిఫాల్ట‌ర్
X

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌పై విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి(ఈఆర్ సీ) బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ప‌లు కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తింది. ఆ పార్టీ త‌ర‌పున టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి త‌న వాద‌న‌లు విన్పించారు. డిస్కంల ద‌గ్గ‌ర రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఒక వినియోగ‌దారు మాత్ర‌మే అన్నారు. ప‌లు రంగాల‌కు విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, వివిధ ప‌థ‌కాల‌పై స‌బ్సిడీని ప్ర‌భుత్వ‌మే తిరిగి చెల్లించాల్సి ఉంటుంద‌ని అన్నారు. స‌ర్కారు ఇలా చెల్లించ‌క‌పోవటంతోనే డిస్కంల అప్పులు 60 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు అయ్యాయ‌న్నారు. ఏటా డిస్కంలకు ప్రభుత్వం 16 వేల కోట్ల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటే... ప్రభుత్వం మాత్రం ఏటా 6 వేల కోట్ల రూపాయ‌లు మాత్రమే చెల్లిస్తోందని, డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్‌ రాష్ట్ర ప్రభుత్వమేనని తప్పుబట్టారు. విద్యుత్‌ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమని విమర్శించారు. ప్ర‌భుత్వం తాను చెల్లించాల్సిన స‌బ్సిడీలు, రాయితీల భారం చెల్లించ‌కుండా ప్ర‌జ‌ల‌పై విద్యుత్ ఛార్జీల భారం వేయ‌టం స‌రికాద‌న్నారు.

Next Story
Share it