Telugu Gateway
Telangana

నిరుద్యోగ భృతిపై కెటీఆర్ ప్రకటన

నిరుద్యోగ భృతిపై కెటీఆర్ ప్రకటన
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నికల హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతిపై మంత్రి కెటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతిపై రేపో మాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించారని తెలిపారు. అవి కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రతి రంగాన్ని ఎక్కడా లోటు లేకుండా న్యాయం చేశారని వ్యాఖ్యానించారు. 'ఇది మీ, మా ప్రభుత్వం. ప్రత్యేక చొరవ తీసుకుంటాం. మౌలిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతున్నాయి. అందులో మీ కృషి కూడా ఉంది. వాయు వేగంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. సాగు తాగు నీరు ఇస్తున్నాం. ధాన్యబాండగారంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆరున్నర ఏళ్లలో అన్ని పూర్తి చేశారు కేసీఆర్. 945 గురుకుల పాఠశాలలు, విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా చేయూత. సీఎం కేసీఆర్. నిన్న ఇవాళ కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకరు టీపీసీసీ, ఒక టీ బీజేపీ. ఈ టీ(తెలంగాణ)అనే పదం కేసీఆర్ పెట్టిన భిక్ష. తెలంగాణ తీసుకొచ్చింది సీఎం కేసీఆర్. పెరిగిన ఆదాయం అన్ని రంగాలకు చేయూతకే. ఇలాంటి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఇష్టానుసారంగా మాట్లాడిన మీరు తప్పక తిప్పికొట్టాలి.

రాష్ట్ర సాధనకు మీరు ఏ విధంగా ఉద్యమం చేశారో అలాగే వీటిని కూడా తిప్పికొట్టాలి.' అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ సమస్య లేదని మంత్రి కెటీఆర్ అన్నారు. భవిష్యత్తులో కూడా కరెంట్ పోదని ఖచ్చితంగా చెప్పగలని భరోసా ఇచ్చారు. గతంలో అన్ని రంగాలకు కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. తెలంగాణలో 7వేల మెగావాట్ల నుండి.16 వేళా మెగావాట్ల ఉత్పత్తికి ఎదిగామని తెలిపిన కేటీఆర్‌ సోలార్ విద్యుత్‌లో రెండో స్థానంలో ఉన్నామన్నారు. 28 రాష్ట్రాల్లో ఎప్పుడూ ముందున్న రాష్ట్రాల కంటే తలసరి విద్యుత్‌లో తెలంగాణ ముందుందని వెల్లడించారు. పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, కొత్త విద్యుత్ కేంద్రాలు, కొత్త లైన్లు అన్ని తీసుకొచ్చింది తెలంగాణా మాత్రమేనని ప్రకటించారు.

Next Story
Share it