తెలంగాణ మార్కెట్ పై ప్రత్యేక ఫోకస్

భద్రతాపరంగా పెరుగుతున్న సవాళ్ళను అధిగమించినందుకు గోద్రెజ్ మార్కెట్ లోకి కొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్ ను అద్నుబాటులోకి తెచ్చింది. వ్యక్తి గత వినియోగదారులతో పాటు సంస్థాగత అవసరాల కోసం మార్కెట్ లోకి వివిధ రకాల ఉత్పత్తులను విడుదల చేశారు. ఆధునిక గృహాలు, వ్యాపారాల కోసం ఆకర్షణీయ డిజైన్, టెక్నాలజీ మేళవింపుతో ఇవి వినియోగదారుల అవసరాలు తీరుస్తాయి అని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌లో భాగమైన సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ విభాగం బిజినెస్ హెడ్ . పుష్కర్ గోఖలే బుధవారం నాడు మీడియా సమావేశంలో వెల్లడించారు. భారీగా వృద్ధి చెందుతున్న తెలంగాణ సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కెట్లో తన అగ్ర స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ గోద్రెజ్ సరికొత్త ప్రీమియం, టెక్-ఆధారిత హోమ్ లాకర్లను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కంపెనీ. పట్టణీకరణ వేగవంతం అవుతుండటం, సెక్యూరిటీతో పాటు కళాభిరుచికి కూడా ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో హైదరాబాద్‌లాంటి మార్కెట్లలో హోమ్, ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీ విభాగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సాంప్రదాయ సేఫ్కీపింగ్కి మించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త ఆవిష్కరణలతో, వినూత్న సొల్యూషన్స్‌ను అందించడం ద్వారా ఈ అవకాశాలను గోద్రెజ్ అందిపుచ్చుకుంటోంది అని తెలిపారు . పట్టణ, సెమీ-అర్బన్ వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా మా లేటెస్ట్ స్మార్ట్ హోమ్ లాకర్లను డిజైన్ చేశాం. ఇందులో బయోమెట్రిక్ యాక్సెస్ నుంచి అలారం సిస్టంలవరకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటోంది. పటిష్టమైన రిటైల్, డిజిటల్ వ్యూహాలతో ఇక్కడ మరింతగా విస్తరించడమనేది, స్థానికంగా అన్ని వర్గాలవారికి అనువైన ఇంటెలిజెంట్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను మరింతగా అందుబాటులోకి తేవడంపై మా నిబద్ధతను తెలియజేస్తుంది” అని పుష్కర్ గోఖలే తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో తెలంగాణలో హోమ్ లాకర్ సెగ్మెంట్ 18 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి.
దీనికి హైదరాబాద్ సారథ్యం వహించనుంది. అత్యధిక పరిమాణంలో విలువైన ఉత్పత్తులను సురక్షితంగా భద్రపర్చుకునేందుకు ఆభరణాల వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన BIS సర్టిఫైడ్ హై-సెక్యూరిటీ సేఫ్ అయిన ‘డిఫెండర్ ఆరం ప్రో రాయల్ క్లాస్ ఈ సేఫ్’ (Defender Aurum Pro Royal Class E safe)ను గోద్రెజ్ ఆవిష్కరించింది. పసిడి టెస్టింగ్‌కి సంబంధించి రిటైల్ జ్యుయలరీ, హాల్‌మార్కింగ్ సెంటర్లు, బ్యాంకుల కోసం యాక్యూగోల్డ్ iEDX సిరీస్ (AccuGold iEDX), ఆర్సీసీ రీఇన్ఫోర్స్డ్ స్ట్రాంగ్ రూమ్‌లను నిర్మించడం సవాళ్లతో కూడుకున్న ప్రదేశాల కోసం గోద్రెజ్ ఎంఎక్స్ (Godrej MX) పోర్టబుల్ స్ట్రాంగ్ రూమ్ మాడ్యులర్ ప్యానెల్స్లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది.