Telugu Gateway
Telangana

శరవేగంగా జీఎంఆర్ విమానాశ్రయ ఎయిర్ సైడ్‌ విస్తరణ

శరవేగంగా జీఎంఆర్ విమానాశ్రయ ఎయిర్ సైడ్‌ విస్తరణ
X

శంషాబాద్ అంత‌ర్జాతీయ విస్త‌ర‌ణ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. విస్తరణ ప్రాజెక్టులో పునరుద్ధరించబడిన టెర్మినల్‌తో పాటు, ఎయిర్‌సైడ్, సిటీ సైడ్ ప్రాంతాలు రెండింటిని విస్తరిస్తున్నారు. విస్తరణ తర్వాత, ఎయిర్‌సైడ్‌లో 93 కోడ్- C ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్‌లు (44 కాంటాక్ట్, 49 రిమోట్ స్టాండ్‌లు) అందుబాటులోకి రానున్న‌ట్లు జీఎంఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అంతర్జాతీయ విమాన కార్యకలాపాల అవసరాలను తీరుస్తున్న వెస్టర్న్ ఏప్రన్ విస్తరణ అనంతరం సుమారు 57,500 చదరపు మీటర్లు ఉంటుంది. ఇక్కడ అదనంగా 17 కాంటాక్ట్ స్టాండులు (కోడ్- C) మరియు ఒక రిమోట్ స్టాండ్ (కోడ్- C) వస్తాయన్నారు. జాతీయ విమాన కార్యకలాపాలకు ఉపయోగపడే తూర్పు ఏప్రన్ విస్తరణ అనంతరం సుమారు 25,500 చదరపు మీటర్లు ఉంటుంది. ఇక్కడ అదనంగా 17 కాంటాక్ట్ స్టాండులు (కోడ్- C) మరియు నాలుగు రిమోట్ స్టాండులు (కోడ్- C) వస్తాయి. అత్యంత తూర్పు భాగాన ఉన్న నూతన రిమోట్ ఏప్రన్ 1,26,200 చదరపు మీటర్లు ఉంటుంది.

ఇక్కడ ఇప్పటికే 42 రిమోట్ స్టాండులు (కోడ్- C)లను ఉపయోగించుకుంటున్నారు. విమానాల రాకపోకల సమయంలో సురక్షితమైన కార్యకలాపాలు, ఎలాంటి ఆటంకాలూ లేని బ్యాగేజ్, ప్రయాణీకులు, గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్‌మెంట్ వాహనాల రాకపోకల కోసం సమయాన్ని ఆదా చేయడానికి ఒక నూతన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రన్‌వే సామర్థ్యాన్ని, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల 4 కొత్త ర్యాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలను ప్రారంభించారు. ఈ రాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేల వల్ల విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుండి ట్యాక్సీ ఆఫ్ (గాలిలోకి ఎగిరి) అయి, తద్వారా రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, రన్‌వే సామర్థ్యం పెరుగుతుంది.· సెకెండరీ రన్ వే ఉపయోగించేటప్పుడు కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు ఒక నూతన ప్యారలల్ ట్యాక్సీ వేను నిర్మించారు. సుస్థిరత్వ దిశగా ఇటీవల ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి వేగంగా నిష్క్రమించి తద్వారా ఇంధన పొదుపు, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం నూతన టాక్సీవేలు, ప్యారలల్ టాక్సీవేలను ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలతో అనుసంధానించారు.

Next Story
Share it