Telugu Gateway
Telangana

పర్యాటకులకు గుడ్ న్యూస్

పర్యాటకులకు గుడ్ న్యూస్
X

థాయిలాండ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఫుకెట్ ఒకటి. ఈ ద్వీపంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఫుకెట్ కు ఇప్పుడు డైరెక్ట్ గా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) ఫుకెట్-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది. తొలి విమానం శుక్రవారం నాడు టేకాఫ్ అయింది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ వారానికి బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు విమాన సర్వీసులను నడపనుంది. ఫిబ్రవరి 15, 2025 నుంచి ఈ ఫ్రీక్వెన్సీ వారానికి ఆరు విమానాలకు పెరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఫుకెట్ చేరుకోవటానికి 3 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.

జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పాణికర్ ఈ సర్వీసుల ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ "ఈ కొత్త సర్వీసులను ప్రవేశపెట్టడం ద్వారా ఫుకెట్ - హైదరాబాద్ మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుండి మరిన్ని ప్రయాణ ఎంపికలను అందించడానికి మా నిరంతర ప్రయత్నంలో భాగంగా ఈ చొరవ ఉంది. ఫుకెట్ పర్యాటకులకు అత్యంత డిమాండ్ ఉన్న గమ్యస్థానాలలో ఒకటి అన్నారు. హైదరాబాద్ - ఫుకెట్ మధ్య నేరుగా విమానాలను ప్రారంభించిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఇది తమకు ఎంతో ఆనందంగా ఉంది అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it