దుమ్ము రేపిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్
దేశీయ విమానయాన రంగం కరోనా కంటే ముందు స్థితికి వచ్చేసినట్లే. హైదరాబాద్ లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023 మర్చి తో ముగిసిన కాలానికి ప్రయాణికుల సంఖ్య ఏకంగా 2 .10 కోట్లుగా నమోదు అయింది. 2022-23లో అటు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ గణనీయంగా పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్ సమస్యలున్నా, దేశీయ విమానయాన సంస్థలు తమ లోడ్ ఫ్యాక్టర్‌లను పెంచాయి, విమాన సర్వీసులు పుంజుకున్నాయి. హైదరాబాద్ నుండి కొత్త దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి.2022-23లో విమానాశ్రయం నుంచి 21 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణించారు. వారిలో, 17.6 మిలియన్లు దేశీయ ప్రయాణీకులు, 3.4 మిలియన్ల కంటే ఎక్కువమంది అంతర్జాతీయ ప్రయాణీకులున్నారు. అదే సమయంలో వచ్చీపోయిన విమానాల సంఖ్య 160,597. వీటిలో 137,640 దేశీయ ఏటిఎం లు, 22,957 అంతర్జాతీయ ఏటిఎంలు. కోవిడ్‌కు ముందు (2019-20) గణాంకాలతో పోలిస్తే, 2022-23లో ప్రయాణీకుల రద్దీ 97% పైగా కోలుకుంది. నిజానికి, 2022-23 సంవత్సరంలో ట్రాన్స్‌ఫర్ ట్రాఫిక్ 13% నుండి 22%కి పెరిగింది. బహుళ జాతి సంస్థలతో పాటు కార్పొరేట్ లు, హైదరాబాద్ నుంచి VFR (విజిటింగ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్), పర్యాటకులు, MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు), విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంది.
దుమ్ము రేపిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ హైదేరాబద్ విమానాశ్రయం ఇప్పుడు సింగపూర్, ఖతార్, షార్జా, దోహా, కువైట్ వంటి మునుపటి గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్-కొలంబో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. సింగపూర్‌కు వైడ్-బాడీ సర్వీస్ నడుస్తోంది. ఢాకా, బాగ్దాద్, డాన్ ముయాంగ్‌కూ సర్వీసులు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి హైదరాబాద్ విమానాశ్రయ సామర్థ్యాన్ని ప్రస్తుత సంవత్సరానికి 12 మిలియన్ ప్రయాణీకులు నుంచి 34 మిలియన్ ప్రయాణీకులకు పెంచుతున్నారు. భారతదేశంలోని అన్ని మెట్రో విమానాశ్రయాలతో పోల్చితే అంతర్జాతీయ ప్రయాణీకుల విభాగంలో హైదరాబాద్ అత్యంత వేగవంతమైన రికవరీని చూసింది.