Telugu Gateway
Telangana

గాంధీ ఆస్పత్రి..పూర్తిగా కోవిడ్ పేషంట్లకే

గాంధీ ఆస్పత్రి..పూర్తిగా కోవిడ్ పేషంట్లకే
X

తెలంగాణలోనూ కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. దీంతో ఎంతో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని భావిస్తున్న హైదరాబాద్ లోనూ కరోనా బాధితులకు బెడ్స్ దొరకని పరిస్థితి. కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు అన్ని చోట్లా ఇంచుమించు ఇదే పరిస్థితి. దీంతో ప్రజలు అంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. కోవిడ్ వైరస్ కేసులు వచ్చినప్పటి నుంచి సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రి ఇఫ్పుడు కూడా పేషంట్ల తాకిడితో ఒత్తిడికి గురవుతోంది.

పది నిమిషాలకు ఒక పేషంట్ ఆస్పత్రికి వస్తుండటంతో ఇక్కడ అన్ని రకాల సేవలు నిలిపివేశారు. ఇక నుంచి గాంధీ ఆస్పత్రిని కేవలం కోవిడ్ ఆస్పత్రిగానే మార్చారు. అత్యవసర సేవలతోపాటు అన్ని రకాల ఇతర సేవలను నిలిపివేశారు. ఏప్రిల్‌ 17 నుంచి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Next Story
Share it