Telugu Gateway
Telangana

తెలంగాణలోనూ ఉచిత వ్యాక్సిన్

తెలంగాణలోనూ ఉచిత వ్యాక్సిన్
X

ఉచిత వ్యాక్సిన్ల బాటలో తెలంగాణ రాష్ట్రం కూడా చేరింది. ముఖ్యమంత్రి కెసీఆర్ శనివారం నాడు ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో అర్హులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ కోసం 2500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ అంశంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కెసీఆర్ తెలిపారు.

''వయసుతో నిమిత్తం లేకుండా అందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. భారత్‌ బయోటెక్, రెడ్డీ ల్యాబ్స్ సహా కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి.. పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారులతో సమీక్షిస్తా. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తా. రెమిడిసివర్, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అధైర్యపడొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు'' అని కెసీఆర్ ప్రకటించారు.

Next Story
Share it