Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో కొత్త‌గా నాలుగు ఒమిక్రాన్ కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా నాలుగు ఒమిక్రాన్ కేసులు
X

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజులు కొత్త కేసుల విష‌యంలో గ్యాప్ వ‌చ్చినా కొత్త‌గా నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో న‌మోదు అయిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు పెరిగింది. కొత్త కేసులున్నీకాంటాక్టుల ద్వారా సోకిన‌ట్లు గుర్తించారు. దేశంలో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండ‌టంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పకుండా ఉండేందుకు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే క‌ర్ణాట‌క‌తోపాటు ప‌లు రాష్ట్రాల్లో క్రిస్మ‌స్ వేడుక‌ల‌తోపాటు నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్షలు విధిస్తున్నారు. ఒమిక్రాన్ తో స్వ‌ల్ప ల‌క్షణాలు మాత్ర‌మే ఉంటున్నా ఈ వైర‌స్ వ్యాప్తి చాలా వేగంగా ఉండ‌ట‌మే ఒక్క‌టే ఆందోళ‌న‌క‌ర ప‌రిణామంగా ఉంది.

Next Story
Share it