రేవంత్ ఫస్ట్..కెటీఆర్ సెకండ్

ఇప్పటికే ఓ నాయకుడు..పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే దత్తత తీసుకంటానని ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఈ హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పింది నిన్ననే అంటే బుధవారం. కాంగ్రెస్ అంటే ఏదో కష్టాల్లో ఉంది..రేవంత్ ఈ హామీ ఇచ్చారనుకుందాం. కెటీఆర్ పరిస్థితి అలా కాదు కదా. అధికారంలో ఉన్నారు..అసలు తెలంగాణ మోడల్ దేశానికి చూపించాలని తహతహలాడుతున్న పార్టీ. ఈ పార్టీ అగ్రనేతలు టీఆర్ ఎస్ అధినేత, సీఎం కెసీఆరేమో ఓ గ్రామం ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మంత్రి కెటీఆర్ మాత్రం గెలిపిస్తే మనుగోడును దత్తత తీసుకుంటానంటున్నారు. ఇవన్నీ చూస్తున్న వారు టీఆర్ఎస్ ఎంత టెన్షన్ లో ఉందో అర్ధం అవుతుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఓ ఉప ఎన్నిక కోసం వంద మందిని ఆ నియోజకవర్గంలో మోహరించింది. అంతేకాదు గతంలో తోక పార్టీలు అంటూ ఎద్దేవా చేసిన వారిని ఇప్పుడు పక్కన పెట్టుకుని మరీ నామినేషన్ వేశారు.



