Top
Telugu Gateway

జూబ్లిహిల్స్ స్కామ్..నరేంద్రచౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు

జూబ్లిహిల్స్ స్కామ్..నరేంద్రచౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు
X

ఏ1గా చౌదరి పేరు

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన ప్లాట్ రిజిస్ట్రేషన్, గోల్ మాల్ కు సంబంధించిన వ్యవహారంలో సొసైటీ మాజీ ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్రచౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. సొసైటీ బైలాస్ ఉల్లంఘించి, ఫోర్జరీ సంతకాలతో 853 ఎఫ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో బి. రవీంద్ర నాథ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఏ1గా నరేంద్ర చౌదరి ఉంటే..పి. హనుంతరావును ఏ2గా, ఏ. సురేష్ రెడ్డినిఏ3గా, సి హెచ్ కృష్ణమూర్తిని ఏ4గా, డి. శ్రీనివాసరెడ్డిని ఏ5గా, ఎండీ జావీదుద్దీన్ ను ఏ6గా, సీహెచ్ శిరీష ఏ7, పి. శ్రీహరి ఏ8గా ఉన్నారు ఇందులో.

కోట్లాది రూపాయల విలువైన ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి అక్రమాలు జరిగినట్లు గుర్తించి సొసైటీ ఫిర్యాదు చేసింది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ గోల్ మాల్ వల్ల సొసైటీకి ఏకంగా 40 కోట్ల రూపాయలపైనే నష్టం వాటిల్లినట్లు కోర్టులో వేసిన పిటీషన్ లో కూడా పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం నాడు 237/2021గా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్లు 120-బి, 406, 408, 409, 419, 420, 467, 468, 471, 477ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

Next Story
Share it