Telugu Gateway
Telangana

పాలన ఫార్మ్ హౌస్ నుంచే...ఫిరాయింపుల చర్చలూ ఫార్మ్ హౌస్ లోనే!

పాలన ఫార్మ్ హౌస్ నుంచే...ఫిరాయింపుల చర్చలూ ఫార్మ్ హౌస్ లోనే!
X

తెలంగాణ లో అంతా వెరైటీ. పాలన ఫార్మ్ హౌస్ నుంచే..ఫిరాయింపుల చర్చలు కూడా ఫార్మ్ హౌస్ లోనే. సీఎం కెసిఆర్ తోలి టర్మ్ నుంచి కూడా ఎక్కువ సమయం ఫార్మ్ హౌస్ లేదా ప్రగతి భవన్ నుంచి పాలన సాగిస్తూ వస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు చాలా సార్లు తీవ్ర విమర్శలు చేశాయి కూడా. ఇప్పుడు కూడా అలాగే సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన నలుగురు ఎమ్మెల్యేల బేరం విషయం ఇప్పుడు ఎన్నో సందేహాలను రేపుతోంది. ఒక వైపు పత్రికల్లో ఒక్కో ఎమ్మెల్యేకి వంద కోట్లు ఇచ్చేందుకు బేరం పెట్టారని రాశారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం తనకు వంద కోట్లు..ఇతర ఎమ్మెల్యేలకు మాత్రం 50 కోట్లు ఇస్తానన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించటం విశేషం. కానీ పత్రికల్లో మాత్రం ఒక్క్కోక్కరికి వంద కోట్ల రూపాయలు అన్న చందంగా రాశారు. ఫార్మ్ హౌస్ లో ఉన్న ఒక ఎంఎల్ఏ ను మీడియా ప్రతినిధి ఒక వైపు మునుగోడు ప్రచారం అంత పీక్ లో నడుస్తుంటే ఇక్కడ ఏమి చేస్తున్నారని అడగ్గా ఫ్రెండ్ ని కలవటానికి వచ్చానని చెప్పారు. ఇతర విషయాలు మాట్లాడటానికి తనకు కొంత సమయం కావాలన్నారు.

ఇది చుసిన వారు అంతా పట్టించటానికి వచ్చినవారి కాన్ఫిడెన్సు వీరిలో కనిపించటం లేదని..పట్టు పడ్డాక మాట మార్చినట్లు ఉండనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ లు ఒకరిపై ఒకరు బురద పూసుకొనే పనిలో ఉన్నారు. ఫస్ట్ డే కాస్త డిఫెన్స్ లో ఉన్నట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు ఎదురు దాడి చేస్తోంది. అటు అధికార టీఆర్ఎస్, పోలిసుల దగ్గర ఇంకా ఏమి ఆధారాలు ఉన్నాయి. అవి ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ ఈ విషయంలో సుప్రీమ్ కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐ విచారణకు అయినా రెడీ అంటూ సవాల్ విసురుతోంది. మరి టీఆర్ఎస్ ఇంకా ఏమి చెపుతుంది అన్నది ఇప్పుడు కీలకం కానుంది. ఫార్మ్ హౌస్ లో కోట్లాది రూపాయల నగదు కట్టలు ఉన్నట్లు మీడియా లో ప్రచారం చేసారు. కానీ పోలీసులు మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదు.

Next Story
Share it