Telugu Gateway
Telangana

కెసిఆర్ కు సోమేశ్ పై ఈ ప్రత్యేక ప్రేమ ఏంటో?!

కెసిఆర్ కు సోమేశ్ పై ఈ ప్రత్యేక ప్రేమ ఏంటో?!
X

తెలంగాణ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ ది ఈ రాష్ట్రం కాదు...ఈ రాష్ట్రంపై ప్రత్యేక ప్రేమ ఉండే అవకాశం కూడా లేదు. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చెప్పినట్లు..అయన ఏది చెపితే అదే చేస్తారు అనే పేరుంది అధికార వర్గాల్లో. అసలు సీఎం కెసిఆర్, మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ ల మధ్య ఈ బంధం ఎందుకంత ఫెవికాల్ బంధంగా మారింది. సలహాదారు పదవి కోసం ఏకంగా ఐఏఎస్ పదవి కూడా వదులుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. క్యాడర్ వివాదంలో హై కోర్ట్ సోమేశ్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లాల్సిందే అని తీర్పు ఇవ్వటంతో అయన అక్కడ రిపోర్ట్ చేసి...తర్వాత వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇటీవల సీఎం కెసిఆర్ తో కలిసి ఔరంగాబాద్ లో బిఆర్ఎస్ సభలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయనకు ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య సలహాదారుగా నియమితులు అయ్యారు.

ఇప్పటికే ఆయనకు తెలంగాణ రాష్ట్ర తొలి సిఎస్ రాజీవ్ శర్మ కూడా సీఎం కు ప్రధాన సలహాదారుగా ఉన్నారు. సోమేశ్ కుమార్ కు తెలంగాణ సర్కారు క్యాబినెట్ ర్యాంక్ తో మూడేళ్లు పదవిలో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లో మొత్తం 12 మంది సలహాదారులు ఉన్నారు అని ...వాళ్ళు సొంతంగా సలహా ఇస్తే మాత్రం వాళ్ళ జాబ్ పోతుంది అని ఒక ఐఏఎస్ అధికారి సెటైర్ వేశారు. ధరణి తో పాటు పలు అంశాల్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. సీఎం ముఖ్య సలహారుగా నియమితులు అయిన సోమేశ్ కుమార్ రాష్ట్ర అవసరాల కోసం కంటే ఎక్కువగా కెసిఆర్ అవసరాలు తీర్చే పనిలోనే ఉండే అవకాశం ఉంది అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ నియామకం ఐఏఎస్ లతో పాటు అధికారుల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it