ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్

ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆయన సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రతిపక్ష పార్టీలు చేసే రెచ్చగొట్టే మాటల వలలో పడొద్దని సూచించారు. ఉద్యోగాలు అన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు-మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో భేటీ ఉందన్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై గతంలో కూడా చెప్పానని..త్వరలోనే వీటికి శ్రీకారం చుడతామన్నారు. మీడియా సమావేశంలో కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...' బీజేపీ నేతలను రైతులు ఊరు ఉరూ వడ్లు కొంటారా? లేదా అని అడగాలి. హుజురాబాద్ లో ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధు ఇస్తాం- మిగిలిన నాలుగు మండలాల్లో వంద శాతం ఇస్తాం. ఈ మార్చి లోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఇస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20వేల కోట్లు బడ్జెట్ లో పెడుతాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్- ఛత్తీస్ ఘడ్ రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు. మేము యుద్ధ వీరులం- మేము అవినీతి చేస్తే ఉద్యమంలో అణిచివేసేవాళ్ళు.
ఇప్పుడు చెరకు విలువ పోయింది. వర్షాకాలంలో కోటి ఎకరాల్లో పత్తి వేసుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుంది. బండి సంజయ్ నిధులు విషయంలో గాలి మాటలు చెప్తున్నాడు. పెట్రోల్- డీజిల్ వాహనాలు పోయి విద్యుత్ వాహనాలు రాబోయే ఇదారేళ్లలో డిమాండ్ ఎక్కువగా వస్తది. దేశానికి కెపాసిటీ ఉన్న విద్యుత్ లో సగం కూడా దేశం వాడటం లేదు. 65వేలకు పైగా టీఎంసీల నీళ్లు ఉంటే- 35వేల టీఎంసీలు కూడా వాడటం లేదు. దేశంలో 40 కోట్ల ఎకరాలు ఉన్నాయి- మొత్తం ఇచ్చినా 20 టీఎంసీల నీళ్లు కూడా పట్టవు. దేశ పరిస్థితి- ఆలోచన సరళి మారాల్సిన అవసరం ఉంది. 1980 లో కూడా చైనా జీడీపీ ఇండియా కంటే తక్కువ. ఇండియా సంస్కరించబడవల్సిన అవసరం ఉంది. ఇండియా కు కొత్త ఎకనామిక్ పాలసీ రావాల్సి ఉంది. తెలంగాణ టీఆరెస్ కు ప్రత్యామ్నాయ లేదు. రామప్పకు యూనిస్కో గుర్తింపు లో కేంద్రం పాత్ర ఏమీలేదు' అని తెలిపారు.