ఎర్రబెల్లి భలే చెప్పారే..హైదరాబాద్ లో పబ్ లే లేవా?!
అసలు హైదరాబాద్ లో పబ్ లే లేవు. ఇక్కడి యువతకు బార్లు..పబ్ ల గురించే తెలియదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి చెపితేనే వారికి ఈ విషయం తెలుస్తుంది. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు అచ్చం అలాగే ఉన్నాయి మరి. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీకి వస్తే విద్యార్ధులు చెడిపోతారు అంట. ఓయూకు వచ్చి రాహుల్ గాంధీ అక్కడ నైట్ క్లబ్ లో పార్టీల గురించి చెబుతారా అంటూ ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఇప్పుడు దేశ, తెలంగాణ రాజకీయం అంతా కూడా రాహుల్ గాంధీ నైట్ క్లబ్ చుట్టూనే తిరుగుతుంది.
అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ వీడియోపై విమర్శలు గుప్పిస్తుంటే కాంగ్రెస్ కూడా అంతే కౌంటర్ ఇస్తుంది. టీఆర్ఎస్ నేతలకు హయత్ హోటల్స్ శాశ్వత రూమ్ లు ఉన్నాయని..వీరంతా రాత్రిళ్లు ఎక్కడకు పోతారో చెప్పాలా అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పెళ్లికి వెళ్లి...అక్కడ పార్టీలో పాల్గొంటే తప్పేముందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీడియాకు కూడా అసలు ఏమి చేస్తున్నారో అర్ధం కావటంలేదని మండిపడ్డారు.