Telugu Gateway
Telangana

తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష
X

కరోనా నియంత్రణ విషయంలో కేంద్రం తీరుపై మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపు లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తుంది. తెలంగాణ లో ఆక్సిజన్ కొరత వస్తె కేంద్రానిదే బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. సమన్వయంతో ముందుకు పోవడం లేదు. కొన్ని ఆసుపత్రుల వారు శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. వాక్సిన్ ధరలో తేడాలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం సంకుచిత ధోరణికి నిదర్శనం.' అని మండిపడ్డారు ఈటెల. తెలంగాణ పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఏపీ, కర్ణాటక లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సీఎం కెసీఆర్ ఆదేశించారు.

ఆ ప్రకారమే 4 లక్షల రెమిడెవిసర్ ఇంజక్షన్ లకు ఆర్డర్ పెట్టాము. మన దగ్గరే ఇవి తయారు అవుతున్నాయి కాబట్టి మనకు ఎక్కువ డోసులు వస్తాయి అని ఆశించాము. కానీ కేంద్రం మొత్తం పంపిణీ వ్యవస్థను తమ కంట్రోల్ లో కి తీసుకొని మనకు మొండి చెయ్యి చూపించింది. తెలంగాణ లో మహారాష్ట్ర, ఏపీ, చత్తీస్ ఘడ్ పేషంట్ల ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు అని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కు చెప్పినా కూడా స్పందన లేదు. నాలుగు లక్షల రెమిడెవిసర్ ఇంజెక్షన్ల కోసం ఆర్డర్ పెడితే గత 10 రోజుల్లో కేంద్రం ఇచ్చింది 21,551 మాత్రమే. అదే గుజరాత్ కి 1.63 లక్షలు, మహారాష్ట్ర కి 2 లక్షలు, ఢిల్లీ కి 61 వెలు, మధ్యప్రదేశ్ కి 92 వేల ఇంజెక్షన్లు ఇచ్చారు. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్ష పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ' అన్నారు.

Next Story
Share it