Telugu Gateway
Telangana

నామా నాగేశ్వ‌ర‌రావు ఆఫీసుల‌పై ఈడీ సోదాలు

నామా నాగేశ్వ‌ర‌రావు ఆఫీసుల‌పై ఈడీ సోదాలు
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) లోక్ స‌భా పార్టీ నేత నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.రాజ‌కీయంగా ఆయ‌న గ‌త కొంత కాలంగా పెద్దగా ఎక్క‌డా క‌న్పించ‌టం లేదు..విన్పించ‌టం లేదు. కానీ ఆక‌స్మాత్తుగా ఈడీ ఎంట‌ర్ కావ‌టంతో ఆయ‌న పేరు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 1064 కోట్ల‌ రూపాయ‌ల బ్యాంక్‌ ఫ్రాడ్‌ చేసినట్లుగా అభియోగాలు రావడంతో నామా ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. రుణాల రూపంలో తీసుకొని విదేశీ కంపెనీలకు ఆ డబ్బు మళ్లించారని నామాపై ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈడీ ఏకకాలంలో ఆయన ఇంటితో పాటు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. నామాతో పాటు రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సీఎండీ కె. శ్రీనివాస్‌, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీ తేజ నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. కాగా 2019లో నామాపై కేసు నమోదు సీబీఐ 2020లో ఆయనపై చార్జీ షీట్ ఫైల్ దాఖలు చేసింది. దీంతో పాటు సీబీఐ మదుకాన్ ఇన్ఫ్రా, మాదుకాన్ ప్రాకెక్ట్, మదుకాన్ టోల్ వే, ఆడిటర్లను చార్జీషీట్లో నిందితులుగా చేర్చింది.

Next Story
Share it