రేవంత్ రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు
BY Admin28 Aug 2021 8:12 AM GMT
X
Admin28 Aug 2021 8:12 AM GMT
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్‌సింహా, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌కు కూడా నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది.
సమన్లు జారీ చేసిన ఈడీ కేసులపై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. అక్టోబర్4న విచారణకు హాజరు కావాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టు ఆదేశించింది.ఇటీవల సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి రేవంత్ కు ఊరట లభించగా..మళ్ళీ ఈడీ ఛార్జిషీట్ రూపంలో కొత్త నోటీసులు వచ్చాయి.
Next Story