Telugu Gateway
Telangana

ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఈటెల రాజేంద‌ర్

ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఈటెల రాజేంద‌ర్
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన ఈటెల రాజేంద‌ర్ బుధ‌వారం నాడు శాస‌న‌స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీక‌ర్ ఛాంబ‌ర్ లో ఈ కార్య‌క్ర‌మం సాగింది. ఈటెల రాజేంద‌ర్ తో శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ప్ర‌మాణ స్వీకారానికి ముందు ఆయ‌న అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించారు. ఈటెల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జితేంద‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. జూన్ 12న ఈటెల రాజేంద‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. భూ కబ్జా ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ను సీఎం కెసీఆర్ మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఉప పోరులో ఎన్నో అవాంత‌రాలు ఎదుర్కొని మ‌రీ ఈటెల రాజేంద‌ర్ విజ‌యం సాధించారు.

Next Story
Share it