ఈటెల రాజేందర్..రాజా సింగ్ హౌస్ అరెస్ట్
బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జనగామలో గాయపబడిన బిజెపి కార్యకర్తలను పరామర్శించేందుకు వీరు బయలుదేరాలని నిర్ణయించుకోవటంతో వీరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ధర్నాలు..రాస్తారోకోలు కేవలం అధికార టీఆర్ఎస్ మాత్రమే చేసుకుంటుందా?. ఇతరులకు అనుమతి ఉండదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో వ్యక్తి స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. పైగా దెబ్బలు తిన్న వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని..ఇదెక్కడి పద్దతి అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బిజెపి మద్దతుతోనే తెలంగాణ వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఇచ్చిన తెలంగాణ గురించే మాట్లాడారన్నారు. పోలీసుల తీరుపై మరో ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.