ఈటెల రాజేందర్ కు ఆపరేషన్
BY Admin2 Aug 2021 11:27 AM GMT
X
Admin2 Aug 2021 11:27 AM GMT
హుజూరాబాద్ పాదయాత్రలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం నాడు ఆయన మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారు. పది రోజుల తర్వాత వైద్యుల సూచన మేరకు పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల ఉప ఎన్నికలో పోటీచేసేందుకు రంగంలోకి దిగి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో వరాల జల్లు కురిపిస్తున్నారు.
Next Story