Telugu Gateway
Telangana

ఈటెల కంపెనీల‌కు మ‌ళ్లీ నోటీసులు

ఈటెల కంపెనీల‌కు మ‌ళ్లీ నోటీసులు
X

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ కుటుంబానికి చెందిన హ్యాచ‌రీస్ కు తెలంగాణ స‌ర్కారు మ‌ళ్ళీ నోటీసులు జారీ చేసింది. జమున హేచరీస్‌ సంస్థకు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్ సర్వే సోమవారం నోటీసులు జారీ అంద‌జేశారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో అసైన్డ్ భూములు ఆక్రమణపై సర్వే నోటీసులు గతంలో ఇచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. జమున హేచరీస్‌ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లినందున దానిపై హైకోర్టు కరోనా తదనంతరం నోటీసులు ఇచ్చి సర్వే చేయమని ఆదేశించిందని, అందుకే ఇప్పుడు మ‌ళ్ళీ నోటీసులు ఇచ్చి స‌ర్వే చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గతంలో కరోనా అధికంగా ఉండటం వల్ల తాము సర్వే చేయలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేయడానికి సిద్ధమయ్యామని.. ఈ నెల 16 తేదీ నుండి 18వ తేదీ వరకు సర్వే చేయడానికి నోటీసులు ఇచ్చామని ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ పేర్కొన్నారు.

జిల్లాలోని అచ్చంపేట, మసాయిపేటలో ఈటల రాజేందర్‌కి చెందిన జమున హేచరీస్ భూమిపై సర్వే అధికారులు తిరిగి విచారణ చేపట్టనున్నారని మెదక్ కలెక్టర్ హరీష్ తెలిపారు. సర్వే జరపవద్దని జుమున హేచరీస్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని.. కరోన తీవ్రత తగ్గేంత వరకు ఆగాలని చెప్పిందని అన్నారు. కోవిడ్ కారణంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆగిన విచారణ తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జమున హెచరీస్‌తోపాటు 200 మంది రైతులకు పరిశ్రమ వ్యాపారులు సర్వేకు సహకరించాలని నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో భూసర్వే ఉంటుందని చెప్పారు. జమున హేచరీస్‌ అధీనంలో సీలింగ్ లాండ్, అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉందనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే కొనసాగుతుందని అన్నారు.

Next Story
Share it