Telugu Gateway
Telangana

తెలంగాణ రాజకీయ దిశ..దశను నిర్ణయించే దుబ్బాక ఫలితం!

తెలంగాణ రాజకీయ దిశ..దశను నిర్ణయించే దుబ్బాక ఫలితం!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ తరుణంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు దిశ,,దిశను నిర్ణయించే అవకాశం ఉంది. 2018 ఎన్నికలతో పోలిస్తే అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో బొటాబొటీ మెజారిటీతో గెలిచినా కొంతలో కొంత పరువు దక్కుతుంది. అసలు ఉప ఎన్నికలో గెలుపుకు అధికార టీఆర్ఎస్ ఇంత కష్టపడాల్సి రావటమే ఓ పెద్ద అంశం. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు బిజెపి దుబ్బాక సీటును దక్కించుకుంటే తెలంగాణ రాజకీయాల్లో అది పెద్ద సంచలనమే అవుతుంది. అధికార టీఆర్ఎస్ అప్పటికీ అన్ని వనరులను ఉపయోగించి బిజెపిని పెద్దగా మెసలనీయకుండా చేసింది. అయినా సరే అన్ని అవరోధాలను అధిగమించి దుబ్బాక సీటును బిజెపి దక్కించుకుంటే అధికార టీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైనట్లే లెక్క.

ఈ అంచనాలు అన్నీ తలకిందులు అయి టీఆర్ఎస్ పార్టీనే మంచి మెజారిటీతో సీటు దక్కించుకుంటే మరికొంత కాలం అధికార పార్టీ దూకుడుకు బ్రేకులు ఉండకపోవచ్చు. కాకపోతే రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా పలు పరీక్షలు రాబోతున్నాయి. ఈ పరీక్షలకు దుబ్బాక ఫలితం అత్యంత కీలకం కానుంది. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు తామే అసలైన ప్రత్యామ్నాయం తామే అని చూపించటంలో బిజెపి ప్రస్తుతానికి అయితే సక్సెస్ అయింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా అదే అనిశ్చితిలో కొనసాగుతోంది. బిజెపి దూకుడుతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకనే అవకాశం ఉంది. అయితే దీనికి దుబ్బాక పలితం అత్యంత కీలకంగా మారనుంది.

Next Story
Share it