Telugu Gateway
Telangana

కమీషన్ల పై తీవ్ర ఆరోణలు!

కమీషన్ల పై తీవ్ర ఆరోణలు!
X

కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏకంగా సచివాలయంలో ధర్నా చేయటం బహుశా ఇదే మొదటి సారి కావొచ్చు. గతంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ హయాంలో బిల్లుల కోసం జీహెచ్ఎంసి ఎదుట కాంట్రాక్టర్ లు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ...అవి సచివాలయం వరకూ ఎప్పుడు రాలేదు. కానీ ఈ సారి ఏకంగా సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కొంత మంది కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. పలు జిల్లాకు చెందిన చిన్న కాంట్రాక్టర్లు ఎప్పటి నుంచో ఆగిపోయిన తమ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రిని కలిసేందుకు వీళ్ళు ప్రయతించగా..భద్రతా సిబ్బంది వాళ్ళను అడ్డుకున్నారు. బిల్లు లు క్లియర్ చేయాలంటే కొంత మంది ఏకంగా 20 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఆరోపించారు. గతంలో ఎన్నడూలేని రీతిలో తెలంగాణ ఆర్థిక శాఖ ఈ సారి మంత్రం బిల్లుల చెల్లింపు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

బిల్లులు చెల్లించేందుకు ఏకంగా పది నుంచి పన్నెండు శాతం కమిషన్లు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటి నుంచో ఈ విమర్శలు ఉన్నా వీటికి ఎక్కడ బ్రేక్ పడిన దాఖలాలు కూడా లేవు. మరో వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు కూడా ఆర్థిక శాఖలో 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప బిల్స్ క్లియర్ కావటం లేదు అంటూ మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఇటీవలే మల్కాజిగిర్ ఎంపీ ఈటల రాజేందర్ అయితే కొంత మంది బిల్లుల చెల్లింపులకు ఇంట్లో వాళ్ళతో కౌంటర్ లు ఓపెన్ చేయించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పేర్లు చెప్పటం సరికాదు అని...అందుకే ఆ పేరు చెప్పటం లేదు అని..కాకపోతే జరిగే విషయాలు అన్ని తనకు తెలుసు అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it