Telugu Gateway
Telangana

స్మార్ట్ గా స్కాం లు..అనక సవాళ్లు

స్మార్ట్ గా స్కాం లు..అనక సవాళ్లు
X

ముందు అప్రూవర్‌ గా మారేందుకు నో చెప్పి...తర్వాత ఎందుకు ఓకే చేశారు

మారిన పరిస్థితులు..అవసరాలే అలా చేయించాయా?

స్కాం లు...రాజకీయాలకు అవినాబావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకే స్కాం లు చేయటానికి స్కోప్ ఉంటుంది. స్కాం చేయటం వేరు..దొరక్కుండా చూసుకోవటం వేరు. ఈ విషయాన్నీ చాలా మంది రాజకీయ నేతలు ఇప్పటికి బాగా నేర్చుసుకున్నారు కూడా. అయితే స్కాం ల్లో పైకి కనిపించని అంశాలు ఎన్నో ఉంటాయి. తెర వెనక జరిగే కోణాలు ఏ మాత్రం బయటకు కనిపించవు. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ లిక్కర్ స్కాం ఒకటి అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. స్కాం లను కేవలం స్కాం లుగానే చూసి చర్యలు తీసుంటారా...లేక వీటిని కూడా అధికారంలో ఉన్న వారు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారా అంటే?. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇందులో పెద్దగా ఎవరూ తక్కువేమి కాదు. దొరికిన వాళ్ళను కూడా తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవటానికి వీటిని వాడుకుంటున్న సంఘటనలు ఎన్నో. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి గురువారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఈ కేసు లో కీలక వ్యక్తిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌ గా మారిపోయారు. దీంతో అయన ఈ కేసు లో ఏమి జరిగిందో మొత్తం పూసగుచ్చినట్లు చెప్పే అవకాశం ఉంది అనే టెన్షన్ కొంత మంది నేతల్లో ఉంది. స్కాం డిజైన్ దగ్గర నుంచి నిధులు కూడా ఎలా వచ్చింది అయన ఉన్నది ఉన్నట్లు విచారణ సంస్థలకు చెపితే జరిగే పరిణామాలు పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది అని చెపుతున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే శరత్ చంద్రా రెడ్డి ని అప్రూవర్‌ గా మార్పించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పటిలో అవి ఫలించలేదు. కానీ మారిన పరిస్థితుల్లో ఎవరి అవసరాల కోసం వాళ్ళు స్టాండ్స్ మార్చుకున్నట్లు చెపుతున్నారు. ఇది రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో కొత్త కొత్త ట్విస్ట్ లకు కారణం అయ్యే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it