Telugu Gateway
Telangana

లీ ఫార్మా నుంచి కోవిడ్ కిట్

లీ ఫార్మా నుంచి కోవిడ్ కిట్
X

లీ ఫార్మా కంపెనీఇంటికే నేరుగా కోవిడ్ కిట్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. లీ ఫార్మాకు చెందిన లీ హెల్త్‌ డొమెయిన్‌.. కోవిడ్‌–19 నిరోధానికి ప్రత్యేక కిట్‌ను ప్రజలకు నేరు ఇంటికి కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ఈ కిట్‌లో కంపెనీ రూపొందించిన రోల్‌ ఆన్‌ కోల్డ్, స్టీమ్‌ మంత్ర, వస తులసి, ప్యారాసిటమాల్‌ 650 ఎంజీ ట్యాబ్లెట్స్, లెవోసెట్రిజిన్‌+మాంటిలుకాస్ట్‌ ట్యాబ్లెట్స్, అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ ట్యాబ్లెట్స్, యాక్టివ్‌ ప్లస్‌ మల్టీ విటమిన్‌ క్యాప్యూల్స్‌ ఉన్నాయి. వీటితోపాటు సానిటైజర్, మాస్కులను కూడా అందించునున్నారు.

ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి ఈ కిట్‌ పెద్ద ఉపశమనం అని కంపెనీ డైరెక్టర్‌ లీలా రాణి తెలిపారు. కోవిడ్‌–19 రోగులు ఫోన్‌ కన్సల్టెన్సీ ద్వారా వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవడం ద్వారా ఆసుపత్రి బిల్లులను నివారించవచ్చని అన్నారు. డోర్‌ డెలివరీతో కలిపి ఈ కిట్‌ ధర రూ.900లుగా కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఫావిపిరావిర్‌–200 ఎంజీ శ్రేణిలో 34 ట్యాబ్లెట్లను రోగి ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తారు. ఈ ట్యాబ్లెట్ల కాటన్‌ ధర రూ.700. ప్రిస్క్రిప్షన్‌ను 7702122599 నంబరుకు వాట్సాప్‌ చేయాల్సి ఉంటుంది. 7702000437 నంబరుకు గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే ద్వారా నగదు పంపితే రోగులకు అవసరమైన మందులను నేరుగా ఇంటికే సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

Next Story
Share it