రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
BY Admin23 March 2021 11:44 AM

X
Admin23 March 2021 11:44 AM
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ కు వెళ్లినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవటంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోనూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
Next Story